ఖాళీగా ఉన్న తెలంగాణ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవువలు ముఖ్యమంత్రి కేసీఆర్ భర్తీ చేశారు. చైర్మన్‌గా మెదక్ జిల్లాకు చెందిన మాల సామాజిక వర్గం నేత బక్కి వెంకటయ్య నియమితులయ్యారు. సభ్యులుగా కుస్రం నీలాదేవి(ఎస్టీ గోండు, ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (ఎస్టీ లంబాడా, దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ (ఎస్సీ మాదిగ, కరీంనగర్), జిల్లా శంకర్ (ఎస్సీ మాదిగ,నల్గొండ జిల్లా), రేణికుంట ప్రవీణ్( ఎస్సీ మాదిగ, ఆదిలాబాద్)లను కేసీఆర్ నియమించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్వర్వులు రేపోమాపో వెలువడనున్నాయి
మెదక్ డీసీసీబీ డైరెక్టర్ అయిన వెంకటయ్య సిద్దిపేటలోని దుబ్బాక మండలం భూంపల్లి గ్రామంలో 1967లో జన్మించారు. 1985లో టీడీపీలో చేరిన ఆయన 1988లో భూంపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2011 వరకు దుబ్బాక జెడ్పీటీసీగా, టీడీపీ నుంచి దుబ్బాక జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. 2015లో బీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2018 వరకు కామారెడ్డి ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. దళిత, గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందేలా చూస్తున్నారు.