మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి ఈ ఆగస్టు 24న జరుగుతుందా? అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం లేదనే అనిపిస్తోంది. ఒకవేళ పెళ్లి ఉన్నట్లైతే ఇప్పటికే వారి ఇంట్లో పెళ్లి సందడి కనిపించేది. కానీ.. ఎక్కడా కూడా ఆ హంగామా లేకపోవడంతో అది కేవలం రూమర్ మాత్రమే అని మొత్తానికి తేలిపోయింది. పెళ్లి ఉంటే ఈ పాటికే శుభలేఖలు పండచం, ముందస్తు కార్యక్రమాల్లో మెగా వారంతా బిజీబిజీగా ఉండేవారు. అయితే అలాంటి పనులేమీ మెగా ఇంట్లో జరగడం లేదు. ఇదిలా ఉంటే వరుణ్ మాత్రం తన నెక్స్ట్ మూవీ గాండీవధారి అర్జున ప్రమోషన్లతో బిజీ బిజీగా ఉంటున్నాడు. వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచుతున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లితో పాటు లావణ్యతో తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గాండీవధారి అర్జున' సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్లలో స్పీడును పెంచారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ స్పై పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ప్రమోషన్లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో వరుణ్ తన లవ్ స్టోరీ, పెళ్లి గురించి ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు."లావణ్యతో నా లవ్‌స్టోరీ మొదలై ఐదేళ్లు దాటిపోయింది. మీమిద్దరం మొదట మంచి ఫ్రెండ్స్. మా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్టులో లావణ్య కూడా ఒకరు. అందుకే మొదట నేనే ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాను. తరువాత మేమిద్దరం ఒక్కటవ్వాలనుకున్నాం. ఇంట్లో వారికి మా ప్రేమ గురించి చెబితే వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
లావణ్య చాలా మెచ్చూర్డ్‌గా ఆలోచిస్తుంది. నా గురించి లావణ్యకు బాగా తెలుసు. నాకు ఏం ఇష్టమో, ఏం కావాలో ఆమెకు తెలుసు. తను చాలా కేరింగ్ పర్సన్. నిజానికి మేం ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నా ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాము. ఎందుకంటే నాకు సంబంధించి నేను పర్సనల్ విషయాలను సీక్రెట్‌గా ఉంచడానికే ఇష్టపడతాను. అందుకే మా లవ్ స్టోరీని రివీల్ చేయడానికి ఇంత సమయం పట్టింది. పెళ్లి కూడా ఎంగేజ్‌మెంట్‌లానే సింపుల్ గా చేసుకుంటాం"అని వరుణ్ తెలిపాడు.