మెగా ఫ్యామిలీ ముద్దు బిడ్డ, నాగబాబు గారాల పట్టి నిహారిక, చైతన్య దంపతుల విడాకుల విషయంపై.. గత కొంత కాలంగా నెట్టింట చర్చ జరుగుతోంది. అందులో నిజం ఎంతుందో తెలియనప్పటికీ.. టాపిక్ మాత్రం హాట్ హాట్ గా ట్రెండ్ అవుతోంది. ఇవన్నీ నిజం అన్నట్లు.. భార్యాభర్తలిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకుని.. ఫొటోలు డిలిట్ చేసుకున్నారు. అంతేకాకుండా నిహారిక ఒక్కతే టూర్లకు తిరగడం.. జిమ్ లో ఫొటోలు దిగి సాడ్ క్యాప్షన్స్ పెట్టడంతో ఆ అనుమానాలన్నీ నిజం అనిపిస్తున్నాయి.
వీరి విషయంలో నిహారిక అత్తమామలతో పాటు.. మెగా ఫ్యామిలీ కూడా కోపంగా ఉందట. అత్తింటి వారే కాకుండా నిహారిక తల్లిదండ్రులు కూడా ఆమెను మునుపటిలా చూసుకోవటం లేదని తెలుస్తోంది. కూతురంటే అమితమైన ప్రేమ ఉన్న నాగబాబు కూడా నిహారికను పట్టించుకోకపోవడంతో.. విడాకుల వివాదం చాలా సీరియస్ గానే ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే, వీళ్లిద్దకి మధ్య జరిగిన విషయం ఏంటి..? అయిన వాళ్లు కూడా దూరం పెట్టేంత తప్పు నిహారిక ఏం చేసిందనేది తెలియాల్సి ఉంది.