SaiDharam Tej : గాంజా శంకర్ ను పోలీస్ లు ఒప్పుకుంటారా..?
పది ఉంటే పార్క్ ల.. పదివేలుంటే పార్క్ హయత్ ల ... ఇదీ సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా 'గాంజా శంకర్' గ్లింప్స్ లోని డైలాగ్. ఇవాళ సాయితేజ్ బర్త్ డే సందర్భంగా 'గాంజా శంకర్' మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. సంపత్ నంది మెగా క్యాంప్ లో ఇంతకు ముందు రామ్ చరణ్ కు రచ్చ వంటి మాసివ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా నిర్మాతగా తన అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తున్నాడు సంపత్. అయితే ఈ కథ విషయంలో సాయితేజ్ కు సజెస్ట్ చేసింది రామ్ చరణే అంటారు కొందరు.
మాస్ అనగానే ఇప్పుడు చాలామంది స్టార్ హీరోలు ఎవకిరి వారు ఓన్ చేసుకుంటున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఒకరు.. గాడ్ ఆఫ్ మాసెస్ అని ఒకరు చెప్పుకుంటున్నారు. అలాంటి వారికి కౌంటరా లేక సెటైరా అని చెప్పలేం కానీ.. ఈ గ్లింప్స్ ఆరంభంలోనే.. 'డోన్ట్ డిఫైన్ ద మాస్.. జస్ట్ ఫీల్ ద మాస్.. విత్ దిస్ మాసివ్ కాంబో.. ' అంటూ వేసిన టైటిల్ కార్డ్స్ మాత్రం నందమూరి హీరోలపై సెటైర్ లానే ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ లాగా వీళ్లు #SSS అని పెట్టారు. అంటే ఈ మూవీ సితార బ్యానర్ లో రూపొందుతోంది కాబట్టి ఒక ఎస్, సాయితేజ్ కోసం ఒక ఎస్, సంపత్ కోసం ఒక ఎస్.. వెరసి ఎస్ఎస్ఎస్ అన్నమాట.
మొత్తంగా గాంజా శంకర్ అనే టైటిల్ ను పోలీస్ లు అనుమతిస్తారా అనే కోణం కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం బేబీ సినిమాలో గాంజా పీలుస్తున్నట్టుగా ఉన్న ఒక సీన్ పెట్టినందుకే దర్శకుడు సాయి రాజేష్ కు హైదరాబాద్ కమీషనర్ సివి ఆనంద్ క్లాస్ పీకాడు. అలాంటిది యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ టైటిల్ ను అనుమతిస్తారు అనుకోలేం. అందుకే వీళ్లు ముందుగానే మరో టైటిల్ కూడా సిద్ధం చేసుకుని ఉంటే బెటరేమో.