ముహూర్తం ఫిక్స్..ప్రేమ పుట్టిన చోటే పెళ్లి..

Update: 2023-06-11 02:32 GMT

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ చాలా సింపుల్‌గా అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి వీరి వివాహం పైనే పడింది. పెళ్లి ఎప్పుడు? ఎక్కడ చేసుకుంటారు? పెళ్లి కూడా నిశ్చితార్థంలా సింపుల్‎గా కనిచ్చేస్తారా? ఎవరెవరు వస్తారు అంటూ మెగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఈ లవ్ బర్డ్స్ తమ వివాహ వేడుకను మాత్రం చాలా గ్రాండ్‎గా చేసుకోవాలని భారీ ప్లాన్స్ వేస్తోందట. ఎంగేజ్మెంట్ అయితే సింపుల్‎గా కానిచ్చాము కానీ, పెళ్లి మాత్రం వేరే లెవెల్‎లో ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు. వీరిద్దరి ప్రేమకు బీజం పడిన చోటనే పెళ్లి చేసుకోవాలని సన్నాహాలు చేస్తోంది ఈ జోడి.


ఇప్పటికైతే తెలిసిన సమాచారం ప్రకారం వరుణ్, లావణ్యలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భారీ ప్లాన్స్ వేస్తున్నారు. విదేశాల్లో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అందుకే పెళ్లి ఇటలీలో జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే డౌట్ రావచ్చు. అందుకు ఓ కారణం ఉంది. వీరిద్దరూ కలిసి మొదటిసారిగా మిస్టర్ సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ నిమిత్తం ఇటలీకి వెళ్లిన వరుణ్ , లావణ్యలు అప్పుడే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారట . ఆ తరువాత అంతరిక్షం సినిమాతో మళ్లీ జోడీ కట్టి తమ బంధాన్ని స్ట్రాంగ్‎గా మార్చుకున్నారని తెలుస్తోంది. అందుకే తమ ప్రేమ చిగురించిన చోటే పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని ఇన్ఫర్మేషన్. త్వరలోనే మెగా ఫ్యామిలీ అనౌన్స్ చేస్తుందని చెబుతున్నారు. 



Tags:    

Similar News