భారత్ సాధించిన గొప్ప విజయం..చంద్రయాన్ 3పై రామ్ చరణ్ పోస్ట్
చంద్రుని దక్షిణ ధ్రువంపై భారత్ బుధవారం చంద్రయాన్ 3ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించడంతో ఈ చారిత్రాత్మక విజయం ప్రతి భారతీయుడిని సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. దీంతో చంద్రయాన్ సాధించిన విజయాన్ని అందరూ గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచేస్తున్నారు. లేటెస్టుగా రామ్ చరణ్ కూడా చంద్రయాన్ సస్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చంద్రయాన్-3 చారిత్రాత్మక మూన్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసిన ఇస్రోను రామ్ చరణ్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తన ట్విటర్ అకౌంట్లో అంతరిక్ష పరిశోధనలో దేశం సాధించిన అద్భుతమైన విజయానికి నటుడు తన ఆనందాన్ని పంచుకున్నాడు.
"లక్ష్యం నెరవేరింది! చంద్రునిపై చంద్రయాన్ కాలుమోపడం భారతదేశ అంతరిక్ష పరిశోధనల్లో ఒక అద్భుతమైన విజయం. అసాధారణమైన ప్రయోగంతో అందరినీ విశ్వానికి చేరువ చేసినందుకు ISROకి నా అభినందనలు!" ఇది జాతికి గర్వకారణం"అని రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.
రామ్ చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్' కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియన్ స్థాయిలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
Mission Accomplished! 🇮🇳Chandrayaan's touchdown on the moon is a remarkable achievement for India's space program. Congratulations to ISRO for their exceptional work and for taking us closer to the cosmos! #ISRO #Chandrayaan3 #JaiHind pic.twitter.com/EqTwPMq6SQ
— Ram Charan (@AlwaysRamCharan) August 24, 2023