లోకేష్ లియోలో రామ్‎చరణ్..ట్విస్ట్ మామూలుగా లేదుగా

Update: 2023-07-04 02:42 GMT

కొంత మంది హీరోల కాంబినేషన్ స్క్రీన్ మీద మామూలుగా ఉండదు. స్టార్ హీరోలు ఒకేసారి ఒకే స్క్రీన్ మీద తమ పెర్ఫార్మెన్స్‎తో దుమ్ముదులుపుతుంటే

ఆడియన్స్‎కు వచ్చే కిక్కే వేరప్పా. అలా వచ్చిన చాలా వరకు కాంబినేషన్‎లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా కూడా ఈ జాబితాలోకే వస్తుంది. విక్రమ్ సినిమా తరువాత లోకేష్ నుంచి వస్తున్న సినిమా లియో. ఇందులో తమిళ సూపర్ స్టార్ విజయ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ లియోపై అంచనాలను భారీగా పెంచేసింది. ఎల్‎సీయూలో భాగంగానే ఈ మూవీ తెరకెక్కబోతుండటంతో అభిమానుల్లో వేరే లెవల్లో బజ్ క్రియేట్ అయ్యింది. అంతేకాదు లియోకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా చాలు సోషల్ మీడియాలో క్షణాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా నెట్టింట్లో అలాంటి వార్తొకటి తెగ వైరల్‌ అవుతుంది.




 


లేటెస్టుగా లియోలో రామ్‌చరణ్‌ క్యామియో ఉండనున్నట్లు ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. విక్రమ్‌ మూవీలో క్లైమాక్స్ సీన్‌ ఏ లెవెల్‎లో ఉందో తెలిసిందే. అదే మాదిరిగా లియోలో కూడా ఓ క్రేజీ క్లైమాక్స్‌ను ప్లాన్ చేశాడట లోకేష్‌ కనకరాజ్. ఈ క్లైమాక్స్‌లో టాప్ మోస్ట్ గ్యాంగ్‌స్టర్‌లందరూ లియో దగ్గరికి వచ్చే సీన్ డిజైన్ చేశాడు లోకాష్. చరణ్‌ కూడా ఓ గ్యాంగ్‎స్టర్‎గా కనిపించనున్నాడట. అయితే ఈ విషయంలో నిజమెంతుందో కానీ ఈ న్యూస్‌ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే రీసెంట్‎గా విడుదల చేసిన టీజర్‌ ఎండింగ్ షాట్‌లో తెలంగాణ రిజిస్ట్రేషన్‌ ఉన్న ఓ కాస్ట్లీ కారును చూపించారు. దీంతో ఆ కారులో చరణ్‌ ఎంట్రీ ఉంటుందన్న న్యూస్‎కు మరింత బలం అందిస్తోంది. మరీ ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అక్టోబర్‌ వరకు వెయిట్ చేయాల్సిందే.




 


నిజానికి ఈ గాసిప్‌ నిజమవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే లోకేష్‌ లిస్ట్‌లో ఎప్పటి నుంచో చరణ్‌ ఉన్నాడు. పైగా చరణ్‌తో తీయబోయే సినిమా కూడా ఎల్‌సీయూలో భాగంగానే తెరకెక్కనుందని సమాచారం. దీంతో లియోలో చరణ్‌ అతిథి పాత్రలో కనిపిస్తాడన్న వార్త నమ్మశక్యంగానే ఉంది. లోకేష్‌ లియో తరువాత ఖైదీ-2ను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తున్నాడు. అది పూర్తి కాగానే విక్రమ్‌-2, రోలెక్స్‌ సినిమాలు తీయనున్నాడని ఇన్ఫర్మేషన్.


Full View





Tags:    

Similar News