Bhola Shankar : భోళా శంకర్‌కు సీఎం సాయం చేస్తారా ?

Update: 2023-08-07 10:13 GMT

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. భోళా శంకర్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రం బృందం రంగం సిద్ధం చేసింది. తమిళ చిత్రం వేదాళమ్ రీమేక్ గా వస్తున్న భోళా శంకర్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్, ట్రైలర్, పాటలు ఓ రేంజ్ లో ఉండడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.




 


విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను భోళా శంకర్ టీం షురూ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‎ను గ్రాండ్‎గా నిర్వహించారు. మరో ప్రక్క ఇక ఈ చిత్రం టిక్కెట్ రేటు పెంచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఏపీలో టికెట్‌పై రూ.25 పెంచాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ కోరారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తి నెలకొంది.

తాజా రాజకీయపరిణామాలు, వైసీపీ-పవన్ కల్యాణ్ బ్రో సినిమా వివాదం నేపథ్యంలో చిరంజీవి సినిమా టికెట్ల పెంపుకు అవకాశం కల్పిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో టికెట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని సమాచారం. ఈరోజు సాయంత్రానికే టికెట్ల రేపు పెంపుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.




 


ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవి సరసన తమన్నా భాటియా నటించగా, మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇక భోళాశంకర్‌ రన్‌ టైం...సీబీఎఫ్‌సీ ప్రకారం 160 నిమిషాలు ఉంటుంది. తెలుగు వెర్షన్‌లో చిరంజీవి ఇమేజ్‌, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేశాడట మెహర్ రమేశ్‌. వాల్తేరు వీరయ్య తరహాలో భోళాశంకర్ కూడా విజయం సాధిస్తుందని మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News