మెగస్టార్ చిరంజీవి కుటుంబం ఈ దసరాను గుర్తుండిపోయే విధంగా జరుపుకుంది. నా అన్నవారు లేని అనాథ బాలికలను ఇంటికి తీసుకొచ్చి పండగ చేసుకుంది. మెగా ఫ్యామిలీ సభ్యులు ఆ అమ్మాయిలను ఆదరించి వారితో కలిసి దసరా, బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన చొరవతో ఈ కార్యక్రమం జరిగింది. ఉపాసన తన నానమ్మ పుష్ప కామినేనికి నివాళిగా.. పుష్ప మూడు దశాబ్దాల పాటు నిర్వహించిన సేవా సమాజ్ ఆశ్రమంలోని బాలికలను ఇంటికి తీసుకొచ్చారు. వేడుకల్లో చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చెర్రీ, ఉపాసన దంపతుల కూతురు క్లీంకారకు సంబంధించిన కార్యక్రమాల్లో ప్రజలను భాగం చేస్తున్నారు. ఆగస్టు 15న ఆ పాపతో జెండాను ఆవిష్కరించారు. క్లీంకార బారసాలకు చెంచు ప్రజలను ఆహ్వానించారు. ఒంటరి మహిళలకు ప్రతి ఆదివారం తమ అపోలో ఆస్పత్రిలో ఉచిత వైద్యసేవలు చేయిస్తున్నారు.