నాకూ క్యాన్సర్ సోకింది : చిరంజీవి

Update: 2023-06-03 13:09 GMT

మెగాస్టార్‌ చిరంజీవి సంచలన విషయాన్ని వెల్లడించారు. గతంలో తనకు క్యాన్సర్ సోకిందని చెప్పారు. జబ్బును ముందే గుర్తించడంతో బతికానని తెలిపారు. కొలనొస్కోపి చేయించుకోవడంతో క్యాన్సర్ తగ్గిందన్నారు. క్యాన్సర్‌ వచ్చిందని చెప్పడానికి తాను భయపడడంలేదని.. ముందుగా గుర్తిస్తే అది పెద్ద జబ్బు కాదని వివరించారు. అయితే ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. హైదరాబాద్లోని ఓ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా చిరంజీవి గతంలోనూ పలు క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News