అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ.. చిరంజీవి ఏమన్నారంటే..?

Update: 2024-01-21 14:55 GMT

దేశం మొత్తం రామనామ స్మరణతో మార్మోగుతోంది. సోమవారం అయోధ్యలో జరగనున్న రాముని ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 12.20 నుంచి 1వరకు బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం హిందువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులను ఆహ్వానించింది అయెధ్య ట్రస్ట్. ఇప్పటికే పలువురు ప్రముఖులు అయోధ్య చేరుకున్నారు. చిరంజీవి సైతం సోమవారం అయోధ్యకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘‘చరిత్ర సృష్టించేలా.. చరిత్రను ఉర్రూతలూగించేలా..చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. రామ్ లల్లా పట్టాభిషేకానికి నాకు అందిన ఆహ్వానాన్ని ఆ దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తాను. 500 ఏళ్లు తర్వాత భారతీయుల నిరీక్షణ ఫలిస్తోంది. స్వయంగా ఆ హనుమంతుడే ఈ చిరంజీవికి ఆ అమూల్యమైన ఘట్టాన్ని తిలకించే క్షణాలను బహుమతిగా ఇచ్చాడేమో అనిపిస్తోంది. మాటల్లో వర్ణించలేని అనుభూతి కలుగుతోంది. నాకు, నా కుటుంబసభ్యులకు ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగికి నా హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా’’ అని చిరు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News