మెహ్రీన్ ప్రియుడి పెళ్లి తేదీ ఫిక్స్.. 3 లక్షల మందికి ఆహ్వానం
హరియాణా ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్, ఐఏఎస్ అధికారి పరి బిష్ణోయ్ పెళ్లికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 22న వీరి పెళ్లి జరగనుంది. ఈ సెలబ్రిటీల పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఏకంగా 3 లక్షల మందికి ఆహ్వానాలు పంపారు. పెళ్లి కొడుకు ఊరూరూ తిరుగుతూ రమ్మని పిలుస్తున్నాడు. పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించిన మెహ్రీన్ పీర్జాదాను భవ్య బిష్ణోయ్ ఇదివరకు ప్రేమించాడు. ఇద్దరికీ 2021లో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. తర్వాత భవ్యకు పరితో పరిచయమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిశ్చితార్థం జరిగింది. భవ్య బిష్ణోయ్ హరియాణా మాజీ సీఎం భజన్ లాల్‌కు మనవడు.
భవ్య, పరిల పెళ్లి రాజస్తాన్‌లోని ఉదయ్పుర్లో ఓ కోటలో జరగనుంది. తర్వాత పుష్కర్, అదంపూర్, డిల్లీలో పెళ్లి విందులు ఉటాయి. విందుకు రావాలని 80 గ్రామాలకు చెందిన 3 లక్షల మందికి ఆహ్వానాలు పంపారు. భవ్య.. అదంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆదంపూర్ నియోజకవర్గానికి భవ్య తాత, తండ్రుల కాలం నుంచి అనుబంధం ఉండడంతో లక్షల కొద్దీ ఆహ్వానాలు వెళ్లారు. రాజస్తాన్‌కు చెందిన పరి సిక్కిం రాజధానిలో విధులు నిర్వహిస్తున్నారు.