విభిన్న కథాచిత్రాలకు కేరాఫ్ అడ్రస్ మైక్ మూవీస్. ‘జార్జిరెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాలతో టాలీవుడ్‌పై తనదైన ముద్రవేసిన ఈ సంస్థ మరికొన్ని వినూత్న చిత్రాలను ప్రేక్షకుల త్వరలోనే అందించనుంది. వాటిలో ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ మూవీ మరింత ప్రత్యేకమైనంది. కడుపుబ్బా నవ్వించే ఈ సటైరికల్ మూవీ ట్రైలర్ గురువారం విడుదలైంది.
జాతకాలు నమ్మి పెళ్లికి ముందు శని పోగొట్టుకోవడానికి ఓ కుక్కను పెళ్లాడిన ఓ యువకుడి చేష్టలు.. అతని జీవితాన్ని ఏ మలుపు తిప్పాయన్నది కథ. దీనికి అందమైన సకుటుంబ కథను, చిలిపి రొమాన్సును జోడించి ఆబాలగోపాలం చూసే చక్కని చిత్రంగా రూపొందిచారు దర్శకుడు ఏఆర్ శ్రీధర్. రొటీన్ కథలకు భిన్నంగా, సరదాగా సాగే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుందని ట్రైలర్ చెబుతోంది. సంజయ్ ఆర్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన ఈ చిత్రం జూలై 21న విడుదల కానుంది. మైక్ మూవీస్ పతకంపై అన్నపరెడ్డి అప్పిరెడ్డి, అన్నపరెడ్డి వెంకట్ రెడ్డి నిర్మించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’లో బ్రహ్మాజీ, సునీల్, సప్తగిరి, అలీ, యాదమ్మరాజు తదితరులు నటించారు. డీఓపీ శ్రీనివాస్ రెడ్డి, సంగీతం భీమ్స్ సిసిరోలియో సమకూర్చారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా రూపొందిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’తోపాటు ‘మట్టికథ’ అనే మరో మూవీ త్వరలో విడుదల కానున్నాయి.