స్లమ్‌డాగ్ హస్బెండ్ విడుదల తేదీ వచ్చేసింది..

Update: 2023-07-10 16:50 GMT

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథతో, మంచి వినోదంతో రూపొందిన సినిమా ‘స్లమ్‌డాగ్ హస్బెండ్’. మైక్ మూవీస్ బ్యానర్‌పై ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ హీరో సత్యదేవ్ సోమవారం విడుదల చేశారు. తను ‘జ్యోతిలక్ష్మి’ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ కథ విన్నానని, అంత ఇంత వినోదంగా మలుస్తారని అనుకోలేదని సత్యదేవ్ అన్నారు. సరికొత్త కథలో ప్రేమను, వినోదాన్ని రంగరించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత అన్నపరెడ్డి అప్పిరెడ్డి తెలిపారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన ఈ చిత్రంలో బహ్రాజీతోపాటు సప్తగిరి, చమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్ తదితరులు నటించారు.

దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ, జంతువులపై ప్రేమ, మనుషుల సెంటిమెంట్ల ఆధారంగా కథ అల్లుకున్నానని చెప్పారు. ‘‘పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్నప్పుడు మనుషులకంటే జంతువులే విధేయంగా ఉంటాయని ఆయన చెప్పేవారు. అప్పట్లో ఐశ్వర్య రాయ్ చెట్టుని పెళ్లి చేసుకుంది. ఆ రెండు పాయింట్లను ఈ కథ అల్లుకుని ఈ సినిమా తీశాను’’ అని చెప్పారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ, ‘‘నేను కుర్ర హీరోలు చాలా నటిస్తున్నారు. అ అబ్బాయిని అందరూ ప్రోత్సహించారు. అయితే తను తన స్వశక్తిపై నిలబడాలి’’ అని అన్నారు.

Full View

Tags:    

Similar News