Komati Reddy : మెగాస్టార్ చిరంజీవిని సత్కరించిన మంత్రి కోమటిరెడ్డి
మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంతో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా చిరు నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. శాలువతో సత్కరించారు.చిరంజీవి పద్మవిభూషణ్ సత్కారానికి ఎంపిక కావడం తనకెంతో సంతోషంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో చిరంజీవికి ‘భారతరత్న’ కూడా రావాలని ఆకాంక్షించారు. పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన చిరంజీవి ప్రస్థానం విశ్వంభర దాకా విజయవంతంగా సాగుతోందన్నారు. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాదిమంది గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మరోవైపు అనేకమంది సినీ ప్రముఖులు చిరంజీవిని కలిసి అభినందనలు చెబుతున్నారు. దీంతో ఆయన నివాసం సందడిగా మారిపోయింది. కంగ్రాట్స్ అన్నయ్య మిమ్ముల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం అని హీరో రవితేజ ట్వీట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే క్షణాలు ఇవి కంగ్రాట్స్ మెగాస్టార్ చిరంజీవి అని మంచు విష్ణు తన ట్వీట్‌లో తెలిపారు.