‘కల్కీ2898AD’ రిలీజ్ గురించే చర్చంతా.. ఆ సెంటిమెంట్నే ఫాలో అవుతారట
ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు.. హాలీవుడ్ ను సైతం షేక్ చేయడానికి వస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘కల్కీ2898AD’. ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కల్కి గ్లింప్స్ అదిరిందంటూ సినీ ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హసన్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండే సరికి హైప్ భారీగా పెరిగిపోయింది. రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఫ్యాన్స్.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో కల్కి రిలీజ్ డేట్ గురించి చర్చ మొదలైంది. మొదట అనుకున్నదాని ప్రకారం జనవరి 14, 2024లో సినిమా విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ, అందుకు మూవీ యూనిట్ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. సెంటిమెంట్ ను ఫాలో అవుతూ సినిమాను పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారట. లీక్స్ ప్రకారం 2024 మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి సినిమాలన్నీ మే 9నే రిలీజ్ అయ్యాయి. ఈ సెంటిమెంట్ తో ‘కల్కీ2898AD’ని కూడా అదే తేదీన రిలీజ్ చేస్తారట.