Salaar release date: ప్రభాస్ ఫ్యాన్స్కు నిరాశ.. వెనకడుగు వేసిన సలార్

Byline :  Bharath
Update: 2023-09-13 11:31 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా సలార్ సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ ఏడాది క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. హోంబలే సంస్థ రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వరుస ఫ్లాప్ ల తర్వాత వస్తున్న భారీ సినిమా కావడంతో.. ప్రభాస్ అభిమానులంతా సలార్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఏడాది క్రితం నుంచే సెప్టెంబర్ 28న సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఓవర్సీస్ లో టికెట్లు విడుదల చేయగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో మిగతా చిన్న సినిమాలన్నీ.. సలార్ ఎఫెక్ట్ తో వెనక్కి తగ్గి రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నాయి.

ఈ టైంలో సలార్ సినిమా విడుదల వేస్తున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఆ వార్తనే నిజం చేస్తు చిత్ర బృందం విడుదల వాయిదా వేసింది. ‘కొన్ని సాంకేతిక కారణాలు, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నాం. హై స్టాండర్డ్స్ తో, అదిరిపోయే సిమాటిక్ ఎక్స్ పీరియన్స్ తో సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీ సపోర్ట్ కు ధన్యవాదాలు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అంటూ హోంబలే అనౌన్స్ చేసింది. కాగా బుక్ మైషోలో మాత్రం రిలీజ్ డేట్ నవంబర్ 2023 అని చూపిస్తుంది.   





Tags:    

Similar News