ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో పండుగే..ఆ రెండు సినిమాల కోసం వెయిటింగ్

Update: 2023-06-05 07:43 GMT

వారం వారం థియేటర్లలో, ఓటీటీల్లో సరికొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది వేసవి సీజన్‎లో మాత్రం సినిమాల జోరు మామూలుగా లేదు. థియేటర్‌లలో వేసవి వినోదాల విందు నాన్ స్టాప్‎గా కొనసాగుతోంది. అదే విధంగా ఓటీటీలోనూ కొత్త చిత్రాలు స్ట్రీమింగ్‎ కానున్నాయి. మరి ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద ఏ సినిమాలు సందడి చేయనున్నాయి. ప్రేక్షకులను అలరించబోయే చిత్రాలేమిటి? ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‎ల లిస్ట్ ఏమిటో తెలుసుకుందాం.

రొమాంటిక్ యాక్షన్ సినిమా టక్కర్ :



చాలా రోజుల తరువాత టాలీవుడ్‎లో సిద్ధార్థ్ సినిమా విడుదల కాబోతోంది. కార్తీక్ జి.క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న టక్కర్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు సిద్ధార్థ్. రొమాంటిక్ యాక్షన్ సినిమా అయిన టక్కర్‎లో హీరోయింన్ దివ్యాంశ కౌశిక్‎తో జోడీ కట్టాడు సిద్దూ. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది.


బిగ్ బాస్ సన్నీ, సప్తగిరీల కామెడీ చిత్రం :



బిగ్ బాస్ ఫేమ్ వి.జె. సన్నీ, కామెడీ స్టార్ సప్తగిరల కాంబినేషన్‎లో డైమండ్‌ రత్నబాబు డైరెక్షన్‎లో వస్తున్న చిత్రం అన్‌స్టాపబుల్‌. రజిత్‌ రావు నిర్మాణంలో వస్తున్న ఈ మూవీలో నక్షత్ర, అక్సాఖాన్‌ హీరోయిన్‎లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ జూన్ 9న విడుదల కానుంది. బాధలు, టెన్షన్లు అన్నీ మరిచిపోయి రెండు గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే విధంగా ఈ మూవీని రూపొందించామని మేకర్స్ చెబుతున్నారు.

విమానం అందరూ చూడాల్సిన సినిమా :



తన కొడుకును విమానం ఎక్కించేందుకు ఓ దివ్యాంగుడైన తండ్రి చేసే ప్రయత్నాలను వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలను అర్థవంతంగా చూపించిన సినిమా విమానం. సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని అంటున్నారు సముద్రఖని. శివ ప్రసాద్‌ డైరెక్షన్‎లో వస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌, కిరణ్‌ కొర్రపాటి నిర్మిస్తున్నారు. మాస్టర్‌ ధ్రువన్‌, మీరా జాస్మిన్‌, అనసూయ, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనసూయ సరికొత్తగా కనిపించనుంది.

పిల్లలు మెచ్చే ఏనుగు కథ :



మాస్టర్‌ శశాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'పోయే ఏనుగు పోయే' కె.ఎస్‌.నాయక్‌ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం జూన్ 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఏనుగు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం పిల్లలు మెచ్చే చిత్రంగా నిలవనుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

జూన్‌ 05 : బర్రకుడ క్వీన్స్‌

జూన్‌ 07 : ఆర్నాల్డ్‌

జూన్‌ 08 : నెవర్‌ హావ్‌ ఐ ఎవర్‌

జూన్‌ 08 : టూర్‌ డి ఫ్రాన్స్‌

జూన్‌ 09 : బ్లడ్‌ హౌండ్స్‌

అమెజాన్‌ ప్రైమ్‌ :

జూన్‌ 08 : మై ఫాల్ట్‌

జీ5 :

జూన్‌ 5 : ది ఐడల్‌

డిస్నీ+హాట్‌స్టార్‌ :

జూన్‌ 07: అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌


జూన్‌07 : సెయింట్‌ ఎక్స్‌

జూన్‌ 09 : ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌

జూన్‌ 10 : ఫ్లామిన్‌ హాట్‌

జియో సినిమా :

జూన్‌ 09 : బ్లడ్‌ డాడీ


జూన్‌ 08 : యూపీ 65

యాపిల్‌ టీవీ ప్లస్‌ :

జూన్‌ 08 : ది క్రౌడెడ్‌ రూమ్‌ 

Tags:    

Similar News