సినిమాల్లో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ కచ్చితంగా నచ్చుతుందని సినిమా హీరోయిన్ రూపా కొడివాయుర్ అన్నారు. మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె మొదట కథ విన్నప్పుడు ఇలాంటి సినిమా తీయడం ఎలా సాధ్యమని అనుకున్నానని అన్నారు. ఇలాంటి డిఫరెంట్ కథను తెరపై ఎలా చూపుతారన్న అనుమానం కలిగిందని, కానీ అరగంట స్క్రిప్ట్ విన్నాక మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ఒక ఎమోషనల్ జర్నీ, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అవుతుందని నమ్మకం కలిగిందని చెప్పారు. మిస్టర్ ప్రెగ్నెంట్లో డిఫరెంట్ రోల్ చేశానని, తనకు అవకాశమిచ్చిన నిర్మాత అప్పిరెడ్డి, మైక్ మూవీస్ టీంకు రూపా కృతజ్ఞతలు తెలిపారు.