బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ హీరోగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు బిగ్ పాజిటివ్ బజ్ వచ్చింది. 200 మంది ప్రెగ్నెంట్ మహిళల కోసం ఈ సినిమా ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి ఒక స్పెషల్ షోను వేశారు. దీనికి వచ్చి సినిమా చూసిన మహిళందరూ చాలా పాజిటివ్ గా స్పందించారు. మూవీ చూసి చాలా ఎమోషనల్ అయ్యామని చెబుతున్నారు. సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందని అన్నారు.
200 మంది ప్రెగ్నెంట్ మహిళలను ఒకచోటకు రప్పించడం అంత తేలిక అయిన పని కాదు. దీనికోసం మేకర్స్ టీమ్ చాలా కష్టపడింది. హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్స్ అన్నింటికీ కాంటాక్ట్ చేసి వివరాలు తీసుకున్నారు. తరువాత వాళ్ళ ఫ్యామిలీస్ ను ఒప్పించి సినిమా చూసేలా చేశాము అని చెబుతున్నారు మేకర్స్. అంతేకాదు వాళ్ళు మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూసి రావడానికి ట్రాన్స్ పోర్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటూ ఎమర్జెన్సీ కోసం కొంత మంది నర్సులను కూడా థియేటర్ దగ్గర ఉండేలా ఏర్పాటు చేశారు.
అసలు ప్రెగ్నెంట్ వుమెన్ కు సినిమా చూపించాలనే ఆలోచనే చాలా కొత్తగా ఉందని అంటున్నారు మూవీ చూడ్డానికి వచ్చినవారు,ఫ్యామిలీస్. ఆలోచన రావడమే గొప్ప అంటే దాన్ని చాలా బాగా అమలుపరచడం కూడా బావుందని...ఇది సినిమా మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ను తెలియజేస్తోందని చెబుతున్నారు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీని వెంకట అన్నపరెడ్డి అప్పిరెడ్డి, అభిషేర్ రెడ్డి బొబ్బల, సజ్జల రవీందర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. మైక్ మూవీస్ నిర్మాణంలో విడుదల అవుతున్న మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీనివాస్ విజంనంపాటి దర్శకత్వం చేశారు. ఇదే ఆయనకు మొదటి సినిమా. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో సొహైల్ ర్యాన్ హీరోగా నటించగా రూప కొడవయూర్ హీరోయిన్ గా చేశారు. వీరితో పాటూ ఇందులో సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు నటించారు.