సీతారామం సినిమాతో అందరి ఫేవరెట్ అయిపోయింది మృణాల్ ఠాకూరు. ఇన తనదైన స్టైల్ లో ఆకట్టుకుని స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. అయితే, ఈ ఇద్దరికి సంబంధించిన ఓ మ్యాటర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు కలిసి ఓ ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. అయితే, విజయ్ దేవరకొండతో సినిమా అంటే.. ఏ రేంజ్ లో రొమాన్స్ ఉంటుందో అందరికీ తెలిసిందే. దాంతో మృణాల్ ఫ్యాన్స్.. తనకు ‘విజయ్ అన్నతో చేస్తున్నావ్ జాగ్రత్త’ అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
తాజాగా, విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి డైరెక్టర్ పరశురామ్ ఒప్పుకున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఖుషి సినిమాతో విజయ్, బాలకృష్ణతో సినిమా చేస్తూ పరశురామ్ బిజీగా ఉన్నారు. మృణాల్ కూడా నాని30లో ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇద్దరి సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపింట్లేదు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్.. తనకు విజయ్ దేవరకొండతో నటించడం కల అని చెప్పింది.
Mrunal Thakur got an opportunity to act with Vijay Deverakonda in Parasuram upcoming film
Mrunal Thakur, Vijay Deverakonda, Parasuram film, tollywood news, movie news, cinema news, latest news, telugu news