‘సీతారామం’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని అందరికీ ఫేవరేట్‌గా మారింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ ఒక్క హిట్‌తో.. యంగ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన చిన్నప్పటి విషయాల నుంచి సినిమాలో ఛాన్సుల వరకూ అన్ని విషయాలు వివరించింది. తనకు చిన్నప్పట్నుంచీ ఆటలంటే చాలా ఇష్టమని. క్రికెట్, బాస్కెట్‌బాల్ ఎక్కువగా ఆడేదాన్నని తెలిపింది. విరాట్ కోహ్లీకి పెద్ధ ఫ్యాన్ అని చెప్పిన మృణాల్.. షాహిద్‌కపూర్ నటనంటే చాలా ఇష్టమని తెలిపింది. ఫస్ట్ క్రష్ అతడేనని, అతడి ఫొటోలను కత్తిరించి దాచుకున్నందుకు ఇంట్లోవాళ్లు తిట్టేవారని గుర్తు చేసుకుంది. అలాంటిది షాహిద్‌తో నటించే అవకాశం రాగానే తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని తెలిపింది.
మీడియా రంగంపై ఉన్న ఆసక్తితో ఇంట్లో వాళ్లని ఒప్పించి బీఎమ్‌ఎమ్ (బ్యాచిలర్స్ ఇన్ మాస్ మీడియా)లో చేరానని, అయితే తనకా చదువు సెట్ కాలేదని చెప్పింది. కాలేజీకి వెళుతుంటే లోకల్ ట్రైన్‌లో డోర్ దగ్గర నిలబడి కిందకి దూకేయాలనిపించేదని షాకింగ్ విషయం బయటపెట్టింది. మరోవైపు కుటుంబానికి దూరంగా ఉండి చదువుకుంటున్నాననే బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలిపింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫేమస్ అయ్యాక.. సినీ ఇండస్ట్రీకి వెళ్తానంటే ఫ్యామిలీలో బప్పుకోలేదని, పేరెంట్స్‌తోపాటు ఇంట్లో అందరికీ ‘త్రీ ఇడియట్స్’ సినిమా చూపించాక ఓకే చెప్పి, ప్రోత్సహించారని తెలిపింది. ఓ వైపు సీరియల్స్ చేస్తూనే, మరోవైపు సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కి వెళ్లేదాన్నని .. ఎన్నో తిరస్కరణలు తన జీవితంలో ఓ పాఠంలా మిగిలిపోయాయని వివరించింది.