ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు భవతరణి (47) కన్నుమూశారు. క్యాన్సర్ కు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్న ఆవిడ.. గత కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఆమె ప్రస్తుతం శ్రీలంకలో క్యాన్సర్ కు ఆయుర్వేధ చికిత్స పొందుతున్న భవతరణి.. అక్కడే తుది శ్వాస విడిచారు. తండ్రి ఇళయరాజ అడుగుజాడల్లో భవతరణి గాయనిగా మెప్పించారు. పలు చిత్రాల్లో పాటలు కూడా పాడారు. భవతరణికి భారతీయర్ అనే సినిమాలో పాడిన పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆమె మరణం అకాల పట్ల సిని ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా.. ఇళయరాజా కుటుంబానికి ధైర్యం చెప్తున్నారు.