విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి మూవీ హిట్ టాక్‌తో ముందుకెళ్తోంది. డైరెక్టర్ శివనిర్వాణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సమంత హీరోయిన్‌గా నటించింది. ప్టెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్గా తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు విజయ్ . అంతే కాదు తన అభిమానులకు ఒక బంఫర్ ఆఫర్ ప్రకటించాడు. వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలను గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పాడు. దీంతో విజయ్ గొప్ప మనసుకు అభిమానులు తెగ మురిసిపోయారు.
అయితే అంతా బాగున్నా విజయ్ ఈ ప్రకటన చేసిన వెంటనే నిర్మాణ సంస్థ అయిన అభిషేక్ పిక్చర్స్ ట్విటర్ వేదికగా విజయ్‌పై విమర్శలకు దిగింది. విజయ్ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8కోట్లు నష్టాపోయామంటూ అభిషేక్ విమర్శలు చేశాడు. ఈ విషయంపై విజయ్ ఎందుకు స్పందించడంలేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు. వంద కుటుంబాలకు కోటి ఇస్తామని విజయ్ ఎలా ప్రకటించాడో అదే విధంగా మా డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం చేయండి అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే ఈ విషయంలో విజయ్ ఫ్యాన్స్ అభిషేక్‌పై గుర్రుగా ఉన్నారు. తాజాగా ఈ అంశంపై విజయ్ దేవరకొండ్ తండ్రి గోవర్దన్ రావు కూడా స్పందించారు. ఇకపై అభిషేక్ బ్యానర్లలో విజయ్ సినిమా చేయబోడని తేల్చేశారు.
విజయ్ దేవరకొండ తండ్రి గోవర్దన్ రావు మాట్లాడుతూ.." 'వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఫ్లాప్ అయినప్పుడు విజయ్ తన రెమ్యునరేషన్లోసగం వెనక్కి ఇచ్చేశాడు. అంతే కాదు తనకు ఇస్తానన్న ఫ్లాట్ కూడా వద్దని చెప్పేశాడు. ఇంతకంటే విజయ్ ఏం చేయాలి. ఇంత చేసినా డిస్ట్రిబ్యూటర్‌కు నష్టాలు వస్తే నా కొడుకు ఏం చేస్తాడు? అది ప్రొడ్యూజర్లతో తేల్చుకోవాల్సిన విషయం. అభిషేక్ మమ్మల్ని చాలా కాలంగా మమ్మల్ని వేధిస్తున్నాడు. నిజానికి మేము అతనితో మాట్లడుతున్న విషయం విజయ్‌కు అస్సలు తెలియదు. అలాంటిది సోషల్ మీడియాలో విజయ్‌ని డైరెక్ట్‌గా టార్గెట్ చేయడమేంటి? ఇది చాలా బాధ కలిగిస్తోంది. నిజంగా మేము డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి. అలాంటిది అభిషేక్ విజయ్‌ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతని పప్పులు ఇకపై ఉడకవు. ఒకసారి అభిషేక్ విజయ్‌కు మార్కెట్ లేదంటాడు..మరోసారి విజయ్‌తో సినిమా తీస్తానంటాడు. అసలు అభిషేక్ మాటలకు, చేతలకు సంబంధమే ఉండదు. ఇప్పుడు విజయ్ దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లకు సైన్ చేశాడు. ఇకపై అభిషేక్ తో మాత్రం విజయ్ సినిమాలు చేయడు" అని విజయ్ చెప్పుకొచ్చాడు.