థంబ్ : ‘పవన్‌కు తప్పుడు సమాచారమిచ్చారు’
'బ్రో' సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో తమిళ చిత్ర పరిశ్రమపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నడిగర్ సంఘం అధ్యక్షుడు, ప్రముఖ నటులు నాజర్ తాజాగా స్పందించారు. పవర్ స్టార్ చెప్పినట్లుగా తమిళ పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ లేవని క్లారిటీ ఇచ్చారు. ఎవరో దీనిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో అలా మాట్లాడరని వివరించారు. తమిళ సినీ కార్మికుల రక్షణ కోసం సెల్వమణి కొన్ని సూచనలు మేరకు తమిళ సినిమా పరిధిలో మాత్రమే మూవీ చేస్తున్నప్పుడు స్థానిక టెక్నీషియన్లను మాత్రమే కొంత వరకు ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాని ఇతరు బాష నటులను వద్దు అని చెప్పలేదని నాజర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలు అయినట్లు నాజర్ పేర్కొన్నారు. " ఓటీటీ వినియోగం ఎక్కువైంది. ఇలాంటి సమయంలో అటువంటి నిబంధనలను ఎవరు తీసుకొస్తారు. ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతో మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్లను తమిళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. ఎస్వీ రంగారావు గారు, సావిత్రి గారు, వాణీ శ్రీ గారు, శారద అమ్మ గారు ఇలా చాలా మంది తమిళులే అని అనుకున్నాను. చాలా కాలం తరువాత నాకు వాళ్లది ఆంధ్రప్రదేశ్ అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన సినిమాల గురించి ఎదురుచూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ల కంటే పెద్ద సినిమాలను మనమందరం కలిసి తీద్దాం' అని నాజర్ అన్నారు.
పవన్ ఏమన్నారంటే..
హైదరాబాద్‌లో వేదికగా 'బ్రో' సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తమిళ చిత్ర పరిశ్రమపై పలు వ్యాఖ్యలు చేశారు. తమిళ పరిశ్రమలో తమిళులు మాత్రమే నటించాలనే ధోరణి నుంచి బయటకు రావాలని అక్కడి పరిశ్రమ పెద్దలకు సూచించారు. అలా వస్తేనే పరిశ్రమ అభివృద్ధి చెందుతాదని సూచించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి కోలీవుడ్ పరిశ్రమ నేర్చుకోవాలని పవన్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతుందని, అందరినీ అక్కున చేర్చుకుంటుందని.. అలాగే తమిళ చిత్ర పరిశ్రమ కూడా అందరినీ తీసుకోవాలని చెప్పారు. అలా కాకుండా తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్లకే అంటే పరిశ్రమ ఎదగదని వ్యాఖ్యానించారు
Nadigar Sangam president actor Nassar React on Pawan Kalyan comments
Nadigar Sangam president,actor Nassar,React on Pawan Kalyan comments, kollywood