వరుస లవ్ స్టీరీస్ తీస్తూ టాలీవుడ్ లవర్ బాయ్ గా మారుతున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఫ్లాప్ టాక్స్ తో గట్టి దెబ్బలు ఎదుర్కొంటున్న చైతన్చ.. ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో నాగచైతన్య మరోసారి విడాకులు తీసుకోబోతున్నాడు అనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏంటి ఆల్ రెడీ సమంతకు విడాకులిచ్చాడు కదా.. మళ్లీ విడాకులు అంటున్నారేంటి..? అని ఆలోచిస్తున్నారా. అంటే అది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో.
విడాకుల కాన్సెప్ట్ తో నాగచైతన్య నెక్స్ట్ సినిమా రోబోతోంది అని టాక్. ఇటీవల విడుదలై.. మంచి టాక్ సంపాదించుకున్న ‘సామజవరగమన’ సినిమా డైరెక్టర్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విడాకుల చుట్టూ తిరిగే ఈ సినిమా కథ.. సూపర్ హిట్ కొడుతుందని ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఎంటర్టైన్ చేయడానికి కామెడీ సీన్స్ చాలానే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.