మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్-7 మొదలవనుంది. ఈ సారి సీజన్ మరింత బావుంటుందని...అంతా ఉల్టా-పల్టా అవుతుందని ప్రోమోలు విడుదల చేస్తోంది టీమ్. వస్తున్న న్యూస్ ప్రకారం అయితే సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ మొదలవుతుందని తెలుస్తోంది. కంటెస్టెంట్స్ పేర్లు బయటకు వస్తున్నా ఇప్పటివరకూ ఎవరు వెళుతున్నారనేది కన్ఫార్మ్ గా తెలియలేదు. ఇప్పుడు ఈ షో కు సంబంధించి మరో పెద్ద న్యూస్ హల్ చల్ చేస్తోంది.
బిగ్ బాస్-6 అట్టర్ ఫ్లాప్ అవడంతో...అసలు 7 ఉంటుందా లేదా అనేది అనుమానం అయింది. అది కాస్తా కన్ఫార్మ అయ్యాక హోస్ట్ గురించి డిస్కషన్ చేశారు. ఈ సారి నాగార్జున ఉండడు అంటూ వార్తలు వచ్చాయి. రానా చేస్తాడని టాక్ నడిచింది. అయితే వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నాగార్జునే మళ్ళీ బిగ్ బాస్ కు హోస్ట్ గా చేస్తున్నారని తెలిసింది. ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఇప్పటివరకు నాగ్ 4 సీజన్లకు హోస్ట్ గా చేశాడు. ఇప్పుడు 5వ సీజన్ కు చేయబోతున్నాడు. బాగ్ బాస్ -4 నుంచి మొదలుపెట్టిన నాగ్ మొదటి దానికి 8-10 కోట్లు, రెండవ దానికి 12 కోట్ల పైచిలుకు, మూడవ దానికి 16 కోట్లు తీసుకున్నట్టు సమాచారం.
ఇప్పుడు నాగ్ చేస్తున్న బిగ్ బాస్-7 కు తన రెమ్యునరేషన్ బాగా పెంచేసాడని టాక్ నడుస్తోంది. అది కూడా ఎంతలా అంటే ఏకంగా 200 కోట్లు తీసుకుంటున్నాడని రూమర్స్ నడుస్తున్నాయి. అయితే దీన్ని ఆయన ఫ్యాన్స్ మాత్రం కొట్టి పడేస్తున్నారు. ఆరో సీజన్ కు 16 కోట్లు అందుకున్నారు. అసలే ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అలాంటిది ఇప్పుడు కొత్తగా వస్తున్న దానికి అంత రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు. 200 కోట్లు అని వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవమని...20 కోట్ల వరకూ తీసుకునే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. నాగార్జున కూడా అంత డిమాండ్ చేయరని అభిమానాన్ని ఒలకపోస్తున్నారు.