మగాడో కాదో అక్కడ తెలుస్తుంది.. ఆర్జీవీ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
రామ్ గోపాల్ వర్మ ఎంత బోల్డో.. అతని మాటలతో ఎన్ని వివాదాలు, ఎన్నిసార్లు వార్తల్లో నిలిచాడో అందరికీ తెలిసిందే. ఆర్జీవీలాగే ఆయన హీరోయిన్ కూడా ఆలోచించింది. ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆర్జీవీ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘నగ్నం’. ఆ సినిమాలో హీరోయిన్గా చేసిన శ్రీరాపాక అప్పట్లో ఫేమస్ అయింది. తర్వాత తనకు పెద్దగా అవకాశాలు దక్కకపోయినా.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్లోనే ఉంది. దాంతో ఆవిడపై ఉన్న క్రేజ్ ఏ మాత్ర తగ్గలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరాపాక.. బోల్డ్ కామెంట్స్ చేసింది.
పెళ్లికి ముందు శృంగారంపై కామెంట్ చేసింది. తన ఫ్రెండ్ లైఫ్ను ఉదాహరణగా చెప్పుకొచ్చిన ఆమె.. ఈ విధమైన కామెంట్స్ చేసింది. ‘పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే తప్పేముంది. అలా చేస్తేనే కదా అతను మగాడా? కాదా తెలిసేది? పెళ్లి అయిన తర్వాత అతను మగాడు కాదని తెలిస్తే పరిస్థితి ఏంటి? ఆడపిళ్ల జీవితం ఆగమై పోవాలా? జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నా ఫ్రెండ్కు ఇలానే జరిగింది. మొదటి రాత్రి తన భర్త గే అని తెలిసింది. తన జీవితం నాశనం అయిందని బాధపడిందం’టూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వాటిపై మండిపడుతూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.