బ్రో .. ఐ డోంట్ కేర్ అన్నాడు. అన్నట్టుగానే.. బ్రో .. బాక్సాఫీస్ ను బ్రోక్ చేశాడు. పండగ టైమ్ లో వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించి.. మహిళాభిమానుల మనసులు దోచుకున్న చిచ్చా.. అచ్చంగా చెప్పినట్టుగానే హ్యాట్రిక్ కొట్టాడు. అంతేనా.. హ్యాట్రిక్ తో పాటు మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. బాలయ్య కెరీర్ లో చాలా తక్కువ రోజుల్లోనే సెంచరీ కొట్టాడు. సో.. రివ్యూస్ తో పనిలేకుండా రెవిన్యూ తెచ్చుకుంటోన్న భగవంత్ కేసరి బాక్సాఫీస్ పై ఏ రేంజ్ దండయాత్ర చేస్తున్నాడో చూద్దాం..
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైనర్ అనుకున్నారు. బట్.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అదరిపోయే కంటెంట్ తో వచ్చారు. బాలయ్య తన ఏజ్ కు తగ్గ పాత్రలో.. శ్రీ లీల కీలకమైన రోల్ చేస్తే.. కాజల్ తనదైన శైలిలో.. అందంగా హుందాగా పాత్ర వరకూ ఆకట్టుకుంది. ఇక యాక్షన్ అండ్ మాస్ సీక్వెన్సెస్ లో అనిల్ టేకింగ్ అదిరిపోతే.. ఇంతకు ముందులా లౌడ్ గా కాకుండా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో బాలయ్య తన పాత్రను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లాడు. ఇక విజ్జిపాపగా శ్రీ లీల నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎమోషన్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ ఇరగదీసింది. ముఖ్యంగా ఫైట్స్ కోసం తను చేసిన రోప్ షాట్స్ చూస్తే.. ఎంత డెడికేషన్ తో ఈ సినిమా చేసిందో అర్థం అవుతుంది.
ఇక అఖండతో రోరింగ్ హిట్ అందుకుని.. వీర సింహారెడ్డితో యాక్షన్, సెంటిమెంట్ పండించి బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన బాలకృష్ణ.. ఈ సారి భగవంత్ కేసరిగా డిఫరెంట్ స్టైల్ లో దుమ్మురేపాడు. ఆయన లుక్ నుంచి ఆహార్యం వరకూ ఈ మధ్య కాలంలో ఇలా ఎప్పుడూ కనిపించలేదు. ఈ విషయంలో అనిల్ రావిపూడిని మెచ్చుకోవాలి. ఈ మొత్తంతో చాలా యేళ్ల తర్వాత బాలయ్య సాలిడ్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఈ మూవీస్ విజయంలో ఎలాంటి డౌట్స్ లేదు. కంటెంట్ విషయంలో కొందరు విభేదించినా.. కమర్షియల్ గా తిరుగులేని విజయాలివి. భగవంత్ కేసరి దసరా హాలిడేస్ ను బాగా క్యాష్ చేసుకుంది. అందుకే కేవలం 6 రోజుల్లోనే వంద కోట్ల మార్క్ ను టచ్ చేసింది. వీర సింహారెడ్డి కూడా వంద కోట్లు కలెక్ట్ చేసినా ఇంత షార్ట్ టైమ్ లో కాదు. ఈ మూవీ ఆరు రోజుల్లో 104 కోట్లు కొల్లగొట్టింది. ఓ రకంగా హ్యాట్రిక్ తో పాటు సెంచరీ కూడా కొట్టిన బాలయ్య డబుల్ బొనాంజా ఇచ్చాడనే చెప్పాలి. మరి ఈ దూకుడు ఇంకా ఎన్ని కోట్ల వరకూ ఉంటుందో చూడాలి.