Bhagavanth Kesari In OTT: ఓటీటీలోకి ‘భగవంత్ కేసరి’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

Update: 2023-10-20 06:10 GMT

నందమూరి నటసింహం బాలయ్య బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా భగవంత్ కేసరి గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలంగాణ యాస, ఎప్పుడూ చూడని అవతారంలో బాలకృష్ణను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. అభిమానుల కోలాహలంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అంతేకాకుండా పలు థియేటర్ల వద్ద బాలకృష్ణ కటౌట్‌లకు మ్యాన్షన్ హౌజ్ మందుతో అభిషేకం చేసి మరి తమ అభిమానం చాటుకున్నారు. . మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే భగవంత్ కేసరి ఓటీటీ స్ట్రీమింగ్ విషయాలు మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన 50 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. అంటే ఈ లెక్క‌న డిసెంబ‌ర్ రెండు లేదంటే మూడో వారంలో ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంద‌ట‌. అయితే.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు దాదాపుగా రాయలసీమ నేపథ్యంలోనే సాగేవి. కాగా, ఈ సినిమా మాత్రం తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలీల ఒక ముఖ్య పాత్రలో కనిపించింది. షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా న‌టించ‌గా తమన్ సంగీతాన్ని అందించారు.


Tags:    

Similar News