జైలర్ తర్వాత రజనీకాంత్ జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞాన వేల్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. జైభీయ్ లానే ఇది కూడా సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కనుంది. ఇందులో మన నేచురల్ స్టార్ నాని కూడా ఒక క్యారెక్టర్ చేయనున్నారని సమాచారం. సినిమాలో నానిది చాలా ముఖ్యమైన రోల్ అని తెలుస్తోంది. కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తారుట. అయినా కూడీ దీని కోస్ నాని భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.
టీజే జ్ఞాన వేల్, రజనీకాంత్ సినిమాకు చాలా స్పెషల్సే ఉన్నట్టుకనిపిస్తున్నాయి. ఈ సినిమాతోనే బాలీవుబ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తమిళ మూవీస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పుడు నాని కూడా ఎంటర్ అయ్యారు. మామూలుగాను రజనీ సినిమాలకు క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ కు మరింత సూపర్ డూపర్ క్రేజ్ యాడ్ అయింది. మూవీలో ఒక పాత్రకు నాని అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని దర్శకుడు, రజనీ అనుకున్నారుట. నాని ని కలిసి కథ కూడా వినించారని తెలుస్తోంది. పాత్ర నచ్చడం, పైగా రజనీతో కలిసి యాక్ట్ చేయడంతో నాని కూడా వెంటనే ఓకే చెప్పేశారుట.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని పాత్ర నిడివి 20 నిమిషాలు మాత్రమే ఉంటుందంట. అయిన కాని ఆ రోల్ కోసం ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అడిగారని టాక్. నిర్మాత కూడా అంత మొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. దసరా మూవీ తర్వాత నాని మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది. పైగా అతను ఇంతకు ముందే రెండు తమిళ సినిమాల్లో కూడా నటించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే అంత డిమాండ్ చేశారని చెబుతున్నారు.