నానీ నుంచి మరో మాస్ యాంగిల్.. అదిరిపోయిన ‘సరిపోదా శనివారం గ్లింప్స్’

Byline :  Bharath
Update: 2024-02-24 09:22 GMT

దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన నాని త్వరలో ‘సరిపోదా శనివారం’ అనే ఆసక్తికర సినిమాతో రాబోతున్నాడు. క్లాసిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నాని, దసరా సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ను పరిచయం చేశాడు. మళ్లీ తిరిగి అలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంటే సుందరానికి లాంటి క్లాసిక్ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో, DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రియక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా SJ సూర్య పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు.

శనివారం (ఫిబ్రవరి 24) నానీ పుట్టిన రోజు కానుకగా.. ఈ సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ‘‘ కోపం అనేది ఒక్కో మనిషిలో ఒక్కో రకంగా ఉంటుంది. కానీ, ఆ కోపాన్ని కూడా క్రమబద్ధంగా, పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా? నేను చూశా. వాడి పేరు సూర్యా’’ అనే డైలాగ్ తో సినిమా కథ ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. ఇందులో నాని లుక్స్ కూడా సరికొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా.. ఆగస్ట్ 29న రిలీజ్ కానుంది. 

Tags:    

Similar News