ఓటు వేయని వాళ్లు చచ్చిపోండి.. 'ప్రతినిధి 2' టీజర్ రిలీజ్

Byline :  Shabarish
Update: 2024-03-29 07:16 GMT

హీరో నారా రోహిత్ ప్రతినిధి మూవీతో మంచి హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రతినిధి2 మూవీతో కంబ్యాక్ ఇవ్వనున్నాడు. నారా రోహిత్ కెరీర్‌లోనే 2014లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రతినిధి నిలిచిపోయింది. అలాంటి సక్సెస్‌నే అందుకోవడానికి ఇప్పుడు సీక్వెల్‌తో రోహిత్ వచ్చేస్తున్నాడు. ప్రతినిధి2 మూవీతో సీనియర్ జర్నలిస్ట్ మూర్తి డైరెక్టర్ అవతారం ఎత్తారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ మొత్తంగా పొలిటికల్ విషయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, అప్పుల గురించి ప్రశ్నించడం ప్రజలను ఆలోచించేలా చేస్తుంది. ఒళ్లు విరుచుకుని ఓటేయండి..లేదా దేశం వదిలి వెళ్లిపోండి..లేదా చచ్చిపోండి అని నారా రోహిత్ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఎన్నికలకు ముందు ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈమూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. మరి టీజర్ ఎలా ఉందో మీరూ చూసేయండి.

Full View

Tags:    

Similar News