NANI : గ్యాంగ్ లీడర్ పోయింది.. ఇక గ్యాంగ్ స్టర్ అంటున్న నాని

Byline :  Babu Rao
Update: 2024-01-31 08:27 GMT

ఏ హీరో అయినా మాస్ హీరో అనిపించుకోవాలనే అనుకుంటాడు. కొన్నిసార్లు చేసిన సినిమాలను బట్టీ.. లేక, తన పర్సనాలిటీని వల్లో డిఫరెంట్ ఇమేజ్ వస్తుంది. ఈ రెండు అంశాలతో నేచురల్ స్టార్ గా ఫ్యామిలీ హీరోగా మారాడు నాని. అతను చేసిన సినిమాలు చూస్తే మాస్ హీరో అనలేం కానీ.. మాస్ నూ మెప్పించే సత్తా ఉన్న నటుడుగా చెప్పొచ్చు. బట్ నాని కూడా తనను మాస్ హీరోగా గుర్తించాలని తాపత్రపడుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా గేర్ మార్చాడు. కాకపోతే బండి స్పీడ్ పెరగలేదు. అతను కోరుకుంటోన్న మాస్ ఇమేజ్ అంత సులువుగా రావడం లేదు. దసరాతో ఊరమాస్ గా కనిపించినా.. ఎందుకో నానిని ఆ గెటప్ లో చూడలేకపోయాడు జనం. అయినా కంటెంట్ వల్ల కాస్త ఆకట్టుకుంది. కొన్నాళ్ల క్రితం గ్యాంగ్ లీడర్ అన్న నాని.. ఈ సారి గ్యాంగ్ స్టర్ అంటున్నాడట.




 


నాని సినిమా అంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అన్న ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల భార్యలు కూడా నాని సినిమా అంటే ఫస్ట్ షో చూడ్డానికే ఇష్టపడతారు. మరోవైపు నేచురల్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ కూడా వచ్చింది. దీంతో కొన్నిసార్లు రిపీటెడ్ ఎక్స్ ప్రెషన్సే ఉన్నా ఆ ట్యాగ్ లో సెట్ అయిపోయాయి.నేచురల్ స్టార్ ఇమేజ్ కు తగ్గ కథలు కొన్నాళ్లుగా వర్కవుట్ కావడం లేదు. అందుకు కారణం చాలా వరకూ రొటీన్ కంటెంట్ తోనే వస్తున్నాడు నాని. నటనలో కూడా వైవిధ్యం కనిపించడం లేదు అంటారు కొందరు. దీంతో మనోడు కూడా మాస్ హీరోగా మారాలనుకున్నాడు. ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ నుంచి మొదలుపెట్టాడు. ఇది జస్ట్ ఓకే అనిపించుకుంది. తర్వాత దసరా అన్నాడు. ఇందులో నాని గెటప్ లో మాస్ ఉంది తప్ప.. పర్ఫార్మెన్స్ లో లేదు. యాక్షన్ లో కనిపించలేదు. చివరి పావుగంట యాక్షన్ ఎపిసోడ్ కోసం ఆ డార్క్ నెస్ ను భరించారు జనం. ఇక గ్యాంగ్ లీడర్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో క్లాస్ మూవీ చేస్తే అది లాస్ అయింది. ఇక ఇప్పుడు గ్యాంగ్ స్టర్ అంటున్నాడట. అది కూడా సాహో దర్శకుడు సుజిత్ తో. యస్.. సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి పొలిటికల్ గ్యాప్ వచ్చింది. ఎన్నికల తర్వాత పూర్తి చేసి సెప్టెంబర్ 27న విడుదల చేస్తాం అని ప్రకటించారు కూడా. ఈ మూవీ తర్వాతే నానితో ఓ గ్యాంగ్ స్టర్ స్టోరీ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. నిజానికి నాని కటౌట్ కు గ్యాంగ్ స్టర్ సినిమా అంటే హెవీ అవుతుందని వేరే చెప్పక్కర్లేదు. అతను పట్టుమని నాలుగు ఫైట్స్ చేస్తేనే కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది గ్యాంగ్ స్టర్ అంటే కష్టమే అనేది చాలామంది భావన. ఏ హీరో అయినా ఇమేజ్ ను దాటి చేసే ప్రయత్నాలను ఎక్స్ పర్మెంట్స్ అంటారు. ఆ ప్రయోగాలు వికటిస్తే అసలుకే మోసం వస్తుంది. ఇటు ఉన్న ఇమేజ్ కూడా పోతుంది. నాని మైండ్ లో ఏముందో కానీ.. ప్రస్తుతం చేస్తున్న సరిపోదా శనివారంలో సైతం ఓ రేంజ్ మాస్ కంటెంట్ కనిపిస్తోంది. మరి నాని కోరిక నెరవేరి క్లాస్ హీరో నుంచి మాస్ హీరోగా మారతాడా లేదా అనేది తర్వాత కానీ.. అసలు ఎందుకొచ్చిన గ్యాంగ్ స్టర్ కథలూ అనేది మాత్రం అతని ఫ్యాన్స్ ఫీలింగ్.




 



Tags:    

Similar News