Madhapur drugs case: ఎక్కడికీ పారిపోలేదు.. సంబంధం లేనివాటిలోకి లాగుతున్నరు: హీరో నవదీప్

Byline :  Bharath
Update: 2023-09-14 15:04 GMT

మాదాపూర్ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీ చుట్టే తిరుగుతుంది. తాజాగా ఈ కేసులో 30 మంది రాజకీయ ప్రముఖుల పేర్లను చేర్చారు. తాజా విచారణలో ఈ కేసులో హీరో నవదీప్ పేరును ప్రస్థావించారు పోలీసులు. నవదీప్ తో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డి, కూడా ఈ కేసులో భాగమైనట్లు తేలింది. కాగా నార్కోటిక్స్ అధికారులు నిర్మాత సుశాంత్ రెడ్డి, దేవరకొండ సురేష్ రెడ్డి, రాంచంద్, కురుపాటి సందీప్, కేపీ రెడ్డిలను అరెస్ట్ చేయగా.. నవదీప్ పరారీలో ఉన్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు. అంతేకాకుండా షాడో సినిమా ప్రొడ్యూజర్ రవి ఉప్పలపాటి, కలహర్ రెడ్డి, ఇంద్రతేజ్, శ్వేత కార్తీక్ లు కూడా నిందితుడిగా తేలడంతో.. వాళ్లంతా పరారీలో ఉన్నారు.




 


డ్రగ్స్ వ్యవహారంలో నవదీప్ ఉన్నాడని, ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ఆరోపణలపై నవదీప్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేయలేదని అన్నాడు. రిపోర్ట్ లో సందీప్ అని పేరుంటే అది తనెలా అవుతానని చెప్పుకొచ్చాడు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, దయచేసి తప్పుడు వార్తలు రాయడం ఆపాలని కోరాడు. అయితే నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ విచారణలో రాంచంద్ ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.




 


ఇదిలా ఉండగా గతంలో కూడా నవదీప్ డ్రగ్స్ కేసులో అభియోగాలు ఎదుర్కున్నాడు. ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా హాజరయ్యాడు. ఈ కేసులో పోలీసులు 50 గ్రాముల MDMA తో పాటు 8 గ్రాముల కొకైన్ ,24 ఎస్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ రాగా.. ఓ ఆర్గనైజర్ ను ఏర్పాటు చేసుకుని సిటీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొందరు నైజీరియన్లు వీసా గడువు ముగిసినా దేశంలోనే అక్రమంగా ఉంటున్నారు. వాళ్లలో కొందరు అనుమానస్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



 


Tags:    

Similar News