Jawan : ‘నటించింది నయన్తార అయినా.. ప్రాధాన్యం మాత్రం ఆమెకే’
పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన తాజా చిత్ర జవాన్. షారుఖ్ ఖాన్, నయన తార, దీపిక పదుకొనె, విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించారు. అట్లీ కుమార్ డైరెక్ట్ చేశాడు. కాగా సెప్టెంబర్ 7న వచ్చిన ఈ సినిమా.. రికార్డులు తిరగ రాసింది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరింది. కాగా నయనతార నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె నటించిన యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. ఇందులో దీపిక కూడా కీలక పాత్ర పోషించింది. సినిమాలో గెస్ట్ రోల్ పోషించినా కథకు మంచి బలాన్నిచ్చింది. ఇదంతా పక్కనబెడితే ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఈ సినిమాపై చర్చ నడుస్తుంది. జవాన్ లో నయన్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ విషయంలో డైరెక్టర్ అట్లీపై నయన్ కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీపిక అతిథి పాత్రలో నటించినా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి.
అంతేకాకుండా ఇకపై బాలీవుడ్ లో నయన్.. నటించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. జవాన్ ప్రమోషన్స్ లో కూడా నయన్ కనిపించకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. షారుఖ్- నయన్ జవాన్ కాస్త.. దీపిక-షారుఖ్ జవాన్ గా మారిందని ఎద్దేవా చేస్తున్నారట సినీ వర్గాలు. గతవారం ముంబైలో జరిగిన సక్సెస్ మీట్ లో విజయ్ తో సహా అందరు హాజరైనా నయన్ మాత్రం ఎగముఖం పెడముఖంగానే ఉంది. ఈ వార్తలను కొందరు నిజం కాదని కొట్టిపారేస్తున్నారు. గతంలో కూడా నయన్ ఏ సినిమా ఈవెంట్ కు వెళ్లలేదని, ఇదివరకు ఆమెకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా ప్రచారాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్తున్నారు.