డాన్స్ అద్భుతంగా చేసే హీరోయిన్లలో తమన్నా ముందుంటుంది. ఎన్టీయార్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళతో సమానంగా స్టెప్పులు వేయగలదు. రీసెంట్ గా తమన్నా హీరోయిన్ గా చేసిన రజనీకాంత్ జైలర్ సినిమాలోని పాట, అందులో హుక్ స్టెప్పులు తెగ పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ని షేక్ చేస్తోంది. దాంతో తమన్నా ఈ పాటలోని హుక్ స్టెప్స్ తో ఒక వీడియోని చేసింది. మీరు కూడా క్రియేట్ చేయండి అంటూ పోస్ట్ చేసింది. ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు.
తమన్నా మరో ఇద్దరితో కలిసి ఈ వీడియోను చేశారు. ఓన్లీ హుక్ స్టెప్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో. దీన్ని రిక్రియేట్ చేస్తూ పాపులర్ చేయడం ఓకే. చాలా పాటలకు ఇది జరుగుతుంది. ఈ మధ్య ఇది చాలా మామూలు అయిపోయింది. కానీ దీన్ని మరొక రకంగా ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్య వచ్చిన ఏఐ టెక్నాలజీని జనాలు తెగ వాడుతున్నారు. అందులోని టూల్స్ తో ఆడుకుంటున్నారు. ఇప్పుడు తమన్నా కావాలయ్యా వీడియోని కూడా ఏఐ టూల్స్ తో ఆడుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. తమన్నా ఫేస్ ఫ్లేస్ లో సిమ్రాన్, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్ళ మొమాలు పెట్టి వీడియోని రిక్రియేట్ చేస్తున్నారు. ఇవి కూడా సోషల్ మీడియాలు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడా తేడా లేకుండా నిజంగా సిమ్రాన్, కాజలే చేశారా అన్నట్టు ఉన్న ఈ వీడియోలను నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భలే ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 10న రిలీజ్ అవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకుడు.మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, సునీల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జైలర్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది మూవీటీమ్. ఇందులో భాగం గానే ఫస్ట్ సింగిల్ గా కావాలయ్యా.. నువ్వు కావాలి'.. సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ పుల్ పాపులర్ అయింది.