Bigg Boss 7: పిచ్చోడవుతున్న ప్రశాంత్.. రతిక ప్రేమ దక్కుతుందా..?
తనదైన గ్లామర్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తుంది రతిక. తొలిరోజే రతిక బ్రేకప్ గురించి నాగార్జున ఆరా తీయగా.. బ్రేకప్ అయిందని, హార్ట్ బ్రేక్ నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చింది. ఇక రతిక ప్రేమించింది ఎవర్నో కాదు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను అంటూ సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు తొలి రోజునుంచే హౌజ్ లో ప్రేమ కథను మొదలుపెట్టింది. మరో కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ తన గుండెల్లో ఉన్నాడని రతిక అనేసరికి.. ప్రశాంత్ ఎక్కువగా ఊహించేసుకుంటున్నాడు.
రతిక కూడా అదే స్థాయిలో ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఈ కథ ముందుకెళ్లేది లేనిది తర్వాత తెలుస్తోంది. ఇక ప్రశాంత్ పరిస్థితి చూసిన ఆడియెన్స్.. రైతు బిడ్డగా హౌజ్ లోకి వెళ్లినవాడు ప్రేమ పిచ్చోడిలా తిరిగొస్తాడని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే.. ప్రశాంతో ఆడియెన్స్ ను ఎమోషనల్ గా పడేయాలని చూస్తున్నాడని అంటున్నారు. హౌజ్ లో కింద పడ్డ అన్నం మెతుకుల్ని ఏరుకుని తినడం. బిగ్ బాస్‌కి అన్నం తినిపించడం. ఇవి చూసి ‘ప్రశాంత్ ఓవరాక్షన్ తట్టుకోలేక పోతున్నాం. ఎమోషన్ తో ఆడియెన్స్ పడేయాలనుకున్నాడో.. లేక బిగ్ బాస్‌కి వచ్చాక అక్కడ పరిస్థితుల వల్ల మైండ్ పాడై ఇలా చేస్తున్నాడా’అని అంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ వారం కొత్త కథ బయటకు వచ్చింది. రతిక.. గౌతమ్ మెడపై పంటిగాట్లని గుర్తించి, వాటిని హౌజ్ లో ఉన్న వాళ్లందరికీ చూపించింది. వాటిని చూడగానే ‘అవి లిప్ స్టిక్ మచ్చల్లా లేవే’ అని ఆట సందీప్ తేల్చాడు. ఆ వెంటనే శుభ్ర శ్రీ రాయగురు.. ‘నా లిప్ స్టిక్ కాదు’ అంటూ భజాలు తడుముకుంది. మొత్తానికి గౌతమ్ మెడపై పంటిగాట్ల వివాహారం హౌజ్ లో హాట్ టాపిక్ అయింది. ఇలా హౌస్ లో రకరకాల విన్యాసాలతో కంటెస్టెంట్స్ రచ్చ చేస్తున్నారు.