Niharika Konidela: చైతన్యకు రెండో పెళ్లి.. నిహారిక ఎమోషనల్ పోస్ట్!!

Update: 2023-10-06 06:48 GMT

మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ చైతన్య దంపతులు ఇటీవలె తమ వివాహ బంధానికి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. 2020 డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్ల పాటు వేరు వేరుగా జీవించి.. ఈ మధ్యే అధికారికంగా విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయాక... నచ్చిన సినిమాలు చేస్తూ.. తన పనిలో తాను బిజీ అయింది నిహారిక. అయితే జోన్నల గడ్డ చైతన్య మాత్రం రెండో పెళ్లికి రెడి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ అమ్మాయి కూడా సెలబ్రిటీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అంటూ వార్తలు అయితే నెట్టింట వైరల్ అవుతున్నాయి.

విడాకులను మ్యాటర్‌ని మర్చిపోవడానికి కొన్నాళ్ల పాటు విహార యాత్రకు వెళ్లి వచ్చాడు చైతన్య. తిరిగి వచ్చాక తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేయడంతో రెండో పెళ్లికి చైతన్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన ఫ్యామిలీ అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ ఐపీఎస్‌ అధికారి కూతురితో చైతన్య రెండో పెళ్లి జరుగబోతుందట. అంతేకాదు ఇరు కుటంబాలు కూడా ఈ విషయాలు చర్చించుకున్నాయని సమాచారం. త్వరలోనే.. చైతన్య మరో ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ అంతా ఇప్పుడు ఇదే విషయాన్ని జోరుగా చర్చించుకుంటుంది.

ఈ క్రమంలో తాజాగా, నిహారిక తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. 7G బృందావన్ కాలనీ మూవీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కన్నుల బాసలు తెలియవులే అని సాగే ఎమోషనల్ సాంగ్‌ను షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు నిహారిక భర్తను మర్చిపోలేక పోతుంది అందుకే ఇలా ఎమోషనల్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లు హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసిన ఆమె ఇప్పుడు ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్‌ను పెట్టడంతో కొందరు భర్త కోసమే పెట్టిందని అనుమానపడుతున్నారు.

Tags:    

Similar News