మెడిటేషన్ సెంటర్‌కు మెగా అల్లుడు.. మనశ్శాంతి కోసమేనా?

Update: 2023-07-02 03:50 GMT

అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ... రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో నచ్చిన వాణ్ని పెళ్లి చేసుకున్న మెగా డాటర్ నిహారిక భర్తతో తెగదెంపులు చేసుకుందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆ రూమర్స్ నిజమేనన్నట్లుగా ఆమె భర్త.. జొన్నలగడ్డ వెంకట చైతన్య ఈ మధ్య జరిగిన తన బావమరిది వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి కూడా రాకపోవడంతో.. ఇక వీరి విడిపోతున్నారు అన్న న్యూస్ ను ఫిక్స్ అవుతున్నారు జనాలు. అందుకు కారణం లేకపోలేదు. . ఇరువురు సోషల్ మీడియాలో అన్ ఫాలో కొట్టుకోవడం, ఇద్దరికీ సంబంధించిన పోస్టులను తమ అకౌంట్స్ ని తొలిగించడం అందరిలో అనుమానాలు మొదలయ్యేలా చేశాయి. పెళ్ళి ఫోటోలు కూడా సోషల్ మీడియా పేజ్ నుంచి డిలీట్ చేయడంతో.. వీరిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుందని.. పక్కాగా విడిపోయి ఉంటారనుకుంటున్నారు.




 


ఈ విషయాలన్నీ పక్కనబెడితే.. గత నాలుగు నెలలుగా చైతన్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరి పోస్ట్ వేశాడు. మళ్ళీ ఇప్పుడు ముంబైలోని ‘గ్లోబల్ విపస్సనా పగోడా’ (Global Vipassana Pagoda) మెడిటేషన్ సెంటర్ ఫోటో షేర్ చేస్తూ.. “ఇక్కడికి నన్ను వచ్చేలా చేసిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. ఒక ప్రదేశానికి మనం ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి ఎంతో జ్ఞానంతో తిరిగి వస్తాం. ఇక చాలా కొందిమంది లైఫ్ లో జరుగుతుంది. ఆలా నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు నుంచి విపస్సనా యోగను చేయడం వల్ల నా లైఫ్ ఇప్పుడు కొంచెం సంతోషంగా, హాయిగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో చైతన్య ఇన్నాళ్లు బాధలో ఉన్నట్లు భావించి నెటిజెన్స్ తనకి ధైర్యం చెబుతూ కామెంట్ చేస్తున్నారు. కాగా నిహారిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండడమే కాకుండా.. వెబ్ సిరీస్ ని నిర్మిస్తూ, నటిస్తూ ఫుల్ ఫార్మ్ లో ఉంది. 



Tags:    

Similar News