మెగా డాటర్ నిహారిక రెండో పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మరొకరిపై ప్రేమ పుట్టదు అనుకుంటే మూర్ఖత్వమే అవుతుందని ఆమె అన్నారు. ఒక రిలేషన్‌షిప్ ఫెయిల్ అవ్వడానికి ఎన్నో కారణాలుంటాయి అలాంటి రిజాన్‌లోతేనే నా మ్యారేజ్ వర్క్ అవుట్ కాలేదని నిహారిక అన్నారు. నాకు పిల్లలంటే ఇష్ట్రం. పిల్లలు కావాలంటే కచ్చితంగా పెళ్లయితే చేసుకుంటాను అని ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. ఎక్కువ బాధ పెట్టిన సంగతి గురించి .. 'రాడిసన్ బ్లూ పబ్ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు. నేను పబ్బులకు, పార్టీలకు చాలా అరుదుగా వెళ్తుంటాను.
ఆరోజు నేను అక్కడ మా స్కూల్ ఫ్రెండ్స్‌ను కలిశాను. ఆరు నెలల తర్వాత వారిని కలిసి కబుర్లు చెప్పుకున్నాం. అయితే ఆ సౌండ్ మాకు ఇబ్బందిగా ఉండటంతో ఇంటికి వెళ్లిపోదామనుకున్నాను. బిల్లు కట్టి బయటకు వచ్చే సమయానికి పోలీసులు వచ్చారు. మమ్మల్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. నాకేం అర్థం కాలేదు. మీడియాలో ఎందుకింత రచ్చ చేశారో అస్సలు అర్థం కాలేదు. కానీ చాలా బాధేసింది. తర్వాత అక్కడెవరో డ్రగ్స్ తీసుకున్నారని తెలిసింది. నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని ఆలస్యంగా తెలసుకున్నాను' అని చెప్పుకొచ్చింది నిహారిక.