Tiger Nageswar Rao Movie : టైగర్ నాగేశ్వరరావుపై బజ్ లేదేంటీ..

Byline :  Babu Rao
Update: 2023-10-18 11:51 GMT

మాస్ మహరాజ్ సినిమా అంటే ఒకప్పుడు మినిమం గ్యారెంటీ. కానీ కొన్నాళ్లుగా మాగ్జిమం లాస్ అవుతున్నాడు. రొటీన్ కథలతో ఇబ్బంది పెట్టాడు. బట్ ఈ కథలు కూడా మార్చాడు. ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అటుపై చేసిన రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. నిజానికి ఈ రెండు సినిమాల ట్రైలర్స్ చూసి ష్యూర్ షాట్ అనుకున్నారు. బట్ రెండూ ఒకదాన్ని మించి ఒకటి నిరాశపరిచాయి. కథల పరంగా చూస్తే ఖచ్చితంగా అతని ఇమేజ్ కు భిన్నమైనవే. అయినా పోయాయి. రవితేజ రిజల్ట్స్ ను బట్టి డల్ అయిపోవడం ఉండదు. అందుకే వరుస సినిమాలతో వస్తున్నాడు. ఈ దసరాకు టైగర్ నాగేశ్వరరావులా వస్తున్నాడు.

చీరాల ప్రాంతంలోని స్టూవర్ట్ పురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే ఓ గజదొంగ కథను పోలిన కంటెంట్ తో ఈ సినిమా రూపొందింది. వంశీ డైరెక్ట్ చేశాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు.ఆ నాగేశ్వరరావు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ కథలన్నీ మాస్ ను ఆకట్టుకునేవే కావడంతో ఆ స్టోరీ సిల్వర్ స్క్రీన్ వరకూ వచ్చింది. రవితేజ లాంటి హీరోకు సరిగ్గా సరిపోయే కథే అని చాలామంది భావించారు. చకచకా షూటింగ్ అయిపోయింది. ట్రైలర్ చాలాబావుందన్న టాక్ తెచ్చుకుంది. ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఇక్కడి వరకూ బానే ఉన్నా.. ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కాబోతోన్న టైగర్ నాగేశ్వరరావుకు ఆ స్థాయి బజ్ క్రియేట్ కాలేదు అనేది నిజం. ముఖ్యంగా భగవంత్ కేసరి, లియోతో పోలిస్తే భారీ క్రేజ్ కనిపించడం లేదు.

రవితేజ గత సినిమాలు డిజాస్టర్ అయి ఉండటం. ఒక సినిమా విషయంలో హీరో కంటే దర్శకుడు చాలా ఎక్కువగా మాట్లాడటం.. రవితేజ విషయంలో ఎప్పుడూ మిస్ ఫైర్ అయింది. ఈ దర్శకుడు వంశీ ఏకంగా తెలుగు సినిమా గర్వ పడే సినిమా అంటున్నాడు. చరిత్రలో నిలిచిపోయే సినిమా అంటున్నాడు. ఇలాంటివే ఎక్కువసార్లు బూమరాంగ్ అవుతాయి. అలాగే మాస్ రాజా గత సినిమాల ట్రైలర్స్ కూడా సూపర్బ్ అనిపించుకున్నా.. రిజల్ట్ తేడాగా వచ్చింది. అదే ఈ సారి కూడా జరుగుతుందేమో అన్న డౌట్ ఆడియన్స్ లో ఉందేమో కానీ.. ఇప్పటికైతే ట్రైలర్ కు రావాల్సినంత రెస్పాన్స్ వచ్చింది.. కానీ సినిమాకు మాత్రం ఊహించిన బజ్ క్రియేట్ కాలేదు. మరి మౌత్ టాక్ తో మాస్ రాజా బాక్సాఫీస్ లను షేక్ చేస్తాడేమో కానీ.. ఈ మూవీతో రవితేజ బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుందాం..


Tags:    

Similar News