పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజి . ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ మూవీలో పవన్ సరసన సందడి చేయబోతోంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రో తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషిస్తూనే మరోవైపు తీరికలేకుండా సినిమాల్లోనూ నటిస్తున్నారు. రీసెంట్గా బ్రో తో దుమ్ముదులిపిన పవన్ .. ఓజితో మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్‌డేట్‌ను మేకర్స్ పవన్ పుట్టినరోజు సందర్భంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మేకర్స్ టీజర్ కట్స్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
ఓజీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. శ్రేయా రెడ్డి కూడా పవర్‌పుల్ లేడీ విలన్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియెన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. సుజిత్ స్టైలిష్ మేకింగ్‌పై కూడా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. సుజిత్ గతంలో రన్ రాజా రన్, సాహో వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే ఈ సినిమాలో మాత్రం పాటలు లేవని తెలుస్తోంది. అయితే హీరో ఆటిట్యూట్‌ను పరిచయం చేస్తూ ఓ పల్లవి ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా పూర్తిస్థాయిలో గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది . పంజా తర్వాత పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని ప్రచారం చేశారు. ఈ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అదే టైటిల్‌ను దర్శక నిర్మాతలు రిజిష్టర్ చేశారు. ఓజీ ప్యాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు మేకర్స్. దీంతో పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్‌లో సినిమాలు పూర్తి చేసే పనిలో మునిగిపోయారు. ఓజి , హరిహర వీరమల్లు వంటి చిత్రాలని త్వరలోనే కంప్లీట్ చేసి..ఆపై రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఎన్నికలు జరిగే నాటికి పార్టీ బలోపేతం కావాల్సి ఉంది. అందుకే అక్టోబర్ ,నవంబర్ వరకే పవన్ షూట్స్ కి అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది .