గుంటూరు కారం.. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకుముందు రిలీజైన ఫస్ట్ సాంగ్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దమ్ మసాలా సాంగ్ దుమ్మురేపింది. తాజా రెండో సాంగ్ ప్రోమో రిలీజైంది. ఓ మై బేబీ అంటూ సాగే ఈ పాటను శిల్పారావు పాడారు. ప్రస్తుతం ప్రోమో రిలీజ్ అవ్వగా.. ఈ నెల 13న ఫుల్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ మూవీలో నాలుగు పాటలు ఉంటాయని అప్పట్లో నిర్మాత నాగవంశీ తెలిపారు. వచ్చే ఏడాది మొత్తం పాడుకునేలా పాటలు అద్బుతంగా ఉంటాయన్నారు. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, రేఖ, రమ్యకృష్ణ, జైరాం, బ్రహ్మానందం, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.