ఓటీటీలోకి ఓం భీం బుష్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

By :  Vinitha
Update: 2024-03-23 10:28 GMT

ప్రస్తుతం ఓటీటీ హావా నడుస్తోంది. హీరో శ్రీవిష్ణు, కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్ లో నటించిన ఓం భీం బుష్ ఇటీవలే రీలీజ్ అయ్యింది. కామెడీ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ శ్రీహర్ష తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సినిమా మార్చ్ 22న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్యాప్షన్ కు తగ్గట్టుగానే లాజిక్స్ కి చాలా దూరంగా ఓన్లీ మ్యాజిక్ వర్కౌట్ అయిన ఈ సినిమా ఆ లెవల్ లోనే ఆకట్టుకుంటోంది. సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ హారర్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగింది. పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

అయితే తాజాగా ఓం భీం బుష్ మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం ఓం భీం బుష్ థియేట్రికల్ రిలీజ్ తరువాత కనీసం నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. దీంతో ఈ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News