ఏ సినిమాలో అయినా ఓ మంచి లవ్ ట్రాక్ ఉండాల్సిందే. మరి లవ్ ట్రాక్ ఉన్నప్పుడు లవ్ సాంగ్ కూడా ఉంటుంది కదా. ఆ పాటలను విడుదల చేయడానికి లవర్స్ డే కు మించిన మంచి వెకేషన్ ఏముంటుంది. అందుకే ‘‘జస్ట్ ఏ మినిట్’’ అనే సినిమా నుంచి తాజాగా రెండో పాటను విడుదల చేశారు. ఇది వేలైంటైన్స్ డేకు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో యూత్ తో పాటు అన్ని వర్గాల వారికీ బాగా రీచ్ అవుతోంది.
అభిషేక్ పచ్చిపాల, నజియా ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమానే ‘జస్ట్ ఏ మినిట్’. రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా అర్షద్ తన్వీర్, ప్రకాష్ దర్మపురి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని పూర్ణస్ యశ్వంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. రాంబాబు గోశాల రాసిన ఈ రెండో పాటకు అద్భుతమైన స్పందన వస్తోందని చెబుతోంది మూవీ టీమ్. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కు మంచి మంచి స్పందన వచ్చిందనీ.. త్వరలోనే ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నామని చెబుతున్నారు.