Ooriperu Bhairavakona : సందీప్ కిషన్ కూ సోలో నా..?

Byline :  Babu Rao
Update: 2024-01-27 10:34 GMT

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు.. ఇప్పుడు ఇండస్ట్రీలో దిల్ రాజు తలచుకుంటే డేట్స్ కు కొదవా అన్నట్టుగా మారింది పరిస్థితి. రీసెంట్ గా హను మాన్ మూవీని పోస్ట్ పోన్ చేయించేందుకు ప్రయత్నించాడు అంటూ ఆయన పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అది సాధ్యం కాక రవితేజ ఈగల్ ను వెనక్కి నెట్టారు. అందుకు గానూ ఈగల్ కు సోలో రిలీజ్ ఇస్తాం అని చెప్పారు. బట్ అదే రోజు సందీప్ కిషన్ ఊరిపేరు భైరవకోనతో పాటు యాత్ర2 చిత్రాలు వస్తున్నాయి. యాత్ర2 వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. బట్ సందీప్ కిషన్ మూవీతో సమస్య తప్పదు అనుకున్నారేమో.. లేక ఈగల్ కు ఇచ్చిన మాటల నిలబెట్టుకోవాలనుకున్నారో కానీ.. మొత్తంగా ఇప్పుడు సందీప్ కిషన్ సినిమాను కూడా ఈగల్ లా సెట్ చేశారంటున్నారు.

ఒక సమస్యను క్లియర్ చేయాలనుకుంటే మరో సమస్య ఎదురవడం అంటే ఇదే. సంక్రాంతి పోటీని తగ్గించేందుకు దిల్ రాజు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయన నిజాయితీకే పెద్ద పరీక్షలా మారింది. సంక్రాంతి టైమ్ లో విడుదల కావాల్సిన రవితేజ ఈగల్ ను ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ చేయించారు. అప్పుడు ఆ చిత్ర నిర్మాతలకు సోలో రిలీజ్ ఉండేలా చూస్తాం అని మాట ఇచ్చారు. అది ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో దిల్ రాజు లాక్ అయిపోయాడు. తీరా చూస్తే అప్పటికే ఆ డేట్ లో తమ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు ఊరిపేరు భైరవకోన నిర్మాతలు. సందీప్ కిషన్ నటించిన ఈ చిత్రం ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అయితే ఈగల్ కు మాట ఇస్తున్నప్పుడు వీరిని సంప్రదించలేదు. ఇటు చూస్తే ఈగల్ నిర్మాతలు సోలో రిలీజ్ కావల్సిందే అని పట్టుపడుతున్నారు. దీంతో ఊరిపేరు భైరవకోనను వాయిదా వేయించే ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ అప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు మేమెందుకు తప్పుకుంటాం అని వీళ్లు మెలిక పెట్టారు. అయినా రవితేజ మాటే ప్రధానం అనుకున్న నిర్మాతల మండలి ఊరిపేరుభైరవకోన నిర్మాతలకూ ఓ ఆప్షన్ ఇచ్చారు. వీరికీ సోలో రిలీజ్ డేట్ ఉండేలా చూస్తాం అనేదే ఆ ఆప్షన్. ఈ మేరకు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేసుకోమని చెప్పారట. బట్ అదే డేట్ లో ఆల్రెడీ గోపీచంద్ భీమా, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉన్నాయి. వీరిలో భీమా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలున్నాయి. బట్ ఆపరేషన్ వాలెంటైన్ ఇప్పటికే నవంబర్ నుంచి ఫిబ్రవరికి వచ్చింది. మరి వీళ్లు దిల్ రాజు అండ్ టీమ్ చెప్పే మాట విని ఊరిపేరు భైరవకోనకు సోలో రిలీజ్ ఇస్తే ఓకే.. లేదూ వీళ్లు కూడా మళ్లీ కొత్త కోరికలు కోరితే.. ఇదో అంతులేని ప్రహసనంగా మారుతుంది. నిర్మాతల మండలికి ఓ కొత్త తలనొప్పిలా మారుతుంది. ముఖ్యంగా ఈ మొత్తంలో సెంటర్ పాయింట్ గా కనిపించేది దిల్ రాజే. అన్ని వేళ్లూ అతనివైపే చూపుతారు. అంచేత దీనికి ఇప్పటికైనా ఓ పర్ఫెక్ట్ ఎండ్ కార్డ్ వేస్తే బెటర్.


Tags:    

Similar News