అట్టహాసంగా ఆస్కార్ వేడుక.. ఓపెన్ హైమర్‌కు అవార్డుల పంట
ప్రపంచ సినీమా రంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ప్రారంభమయింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా మొదలైంది. దేశ, విదేశాల నుంచి సినీ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. కాగా ఈసారి ఓపెన్ హైమర్ సినిమా సత్తాచాటింది. అణుబాంబును కనిపెట్టిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హైమర్ బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను రూపొందించిన క్రిస్టోఫర్ నోలన్ తొలిసారిగా అకాడమీ అవార్డు అందుకున్నాడు.
ఓపెన్ హైమర్ అవార్డులు:
ఉత్తమ చిత్రం- ఓపెన్ హైమర్
బెస్డ్ డైరెక్టర్- క్రిస్టోఫర్ నోలన్
బెస్ట్ యాక్టర్- కిలియన్ మర్ఫీ
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- రాబర్ట్ డౌనీ జూనియర్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్- వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్
బెస్ట్ సినిమాటోగ్రఫీ- ఓపెన్ హైమర్
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్- జెన్నిఫర్ లేమ్
ఆస్కార్ విజేతలు:
ఉత్తమ సహాయ నటి: డివైన్ జాయ్ రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
బెస్ట్ హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్
బెస్ట్ కాస్టూమ్ డిజైన్: హోలి వెడ్డింగ్‌టన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్ హైమర్ (జెన్నిఫర్ లేమ్)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌పుట్, క్రిస్ బ్రోవర్స్)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియూపోల్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
బెస్ట్ సౌండ్: ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న విల్లర్స్, జానీ బర్న్)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్: ఓపెన్ హైమర్ (లుడ్విగ్ గోరాన్సన్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్: వాట్ వాజ్ ఐ మేర్ ఫర్ (బార్బీ)
బెస్ట్ యాక్ట్రెస్: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)Oppenheimer sweeps the 96th Academy with 7 Awards
The ‘OPPENHEIMER’ team on the #Oscars2024 stage after winning Best Picture. pic.twitter.com/TPssXpRwUc
— Christopher Nolan Art & Updates (@NolanAnalyst) March 11, 2024
‘OPPENHEIMER’ was the most awarded film at the 96th Academy Awards with a total of 7 wins. pic.twitter.com/JwDkdR8dWY
— Christopher Nolan Art & Updates (@NolanAnalyst) March 11, 2024