రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సహా సాంగ్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఐదో సాంగ్ రిలీజ్ అయ్యింది.
ఓసీ పెళ్లమా అంటూ సాగే ఈ పాట కూడా ఆకట్టుకుంటోంది. సమంత పెట్టే ఇబ్బందులను విజయ్ ఈ పాట రూపంలో చెప్పాడు. ‘‘ఓసీ పెళ్లమా నన్ను మిర్చిలాగా నంజుకుంటావే.. వద్దు ఆపమ్మా నేను కోడిలాగ గింజుకుంటానే.. పెళ్లి ఊసు పాడుగానూ మానుకోండి.. గన్ను కంటే పవర్ ఫుల్ ఆలి’’ అండి అంటూ సాగే ఈ సాంగ్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటను డైరెక్టర్ శివ నిర్వాణ రాయగా.. రాహుల్ సిప్లిగంజ్ పాడారు.
ఇక ఈ మూవీకి హేషాం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. అంతకుముందు రిలీజైన నా రోజా నువ్వే, ఆరాధ్య, ఖుషి సాంగ్స్ యూట్యూబ్లో ట్రెండింగ్గా మారాయి. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి ఇక ఈ సినిమాలో జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.