రాకేశ్‌ మాస్టర్‌‌ని అలా వదిలేసి తప్పుచేశారు :పరుచూరి గోపాలకృష్ణ

Update: 2023-06-27 16:19 GMT

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ మరణం..అభిమానులను, టాలీవుడ్‌ను షాకింగ్ గురిచేసింది. సోషల్ మీడియోలో యాక్టివ్‎గా ఉండే మాస్టర్ అనారోగ్యానికి గురై ఇటీవల ప్రాణాలు కోల్పోవడం అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. రాకేష్ మృతిపై తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ " రాకేశ్‌ మాస్టర్‌తో నేను ఎక్కువగా పనిచేయలేదు కానీ, ఆయన గురువైన ముక్కురాజు గారితో నేను ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశాను. ఆ తర్వాత ఢీ, జబర్దస్త్‌ కార్యక్రమాల్లో రాకేశ్‌ మాస్టర్‌ను చూశాను. అతను చనిపోయిన వార్త నన్ను షాక్‌కు గురి చేసింది. మాస్టర్ చనిపోయాక మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఇకనైనా మానేయండి అని యూట్యూబ్ ఛానల్స్‌ను ఉద్దేశించి వాళ్ల కొడుకు చేసిన కామెంట్స్ చూసి నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాకేష్ మాస్టర్ టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. 1500 పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. టాలీవుడ్‌కు శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌ లాంటి అద్భుతమైన కొరియాగ్రాఫర్లను అందించారు. వారు రాకేశ్‌ మాస్టర్‌ దగ్గర కన్నీరు పెట్టుకుంటుంటే అందరికీ బాధేసింది" అని చెప్పుకొచ్చారు.

రాకేష్ మాస్టర్ బాధల్లో ఉన్నప్పుడు ఎవరైన ఆదుకుంటే బతికేవారని చెప్పారు. తన ఆవేదనను అర్థం చేసుకుని కొత్త అవకాశాలు ఇవ్వాల్సిందని తెలిపారు. అప్‌కమింగ్‌ హీరోలు, అప్‌ కమింగ్‌ దర్శకులో ఎవరో ఒకరు ఆయన్ని మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భగవంతుడు మనకు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని బాధపడుతూ కూర్చోకూడదు. అది కుదరనప్పుడు మరోమార్గాన్ని ఎంచుకోవాలి" అని పరుచూరి గోపాలకృష్ణ స్పష్టం చేశారు.

Tags:    

Similar News